బీద ఆర్య వైశ్య కుటుంబానికి చేయూత

 


అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ వారు హైదరాబాద్ పాత నగరంలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుక బడిన, పేద వైశ్య అమ్మాయి శ్రీ ఉతునూరి వేణుగోపాల్ కుమార్తె  శిరిషాకు  మరియు ఆమె కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర అవోపా వారు నిర్వహిస్తున్న అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్, నూకా యాదగిరి సిఫార్సు చేయగా దాతల నుండి సహాయము ఏర్పాటు చేశారు. వివరాల లోకి వెళితే ఆమె తండ్రి పాత నగరంలోని బట్టల దుకాణంలో చిన్న ఉద్యోగి అని, మరియు ప్రస్తుత కోవిడ్ సినెరియా లో సాధారణ జీవితం గడపడం కష్టమవుతుందని, ప్రతి సంవత్సరం ఈ కుటుంబం వైశ్య హాస్టల్ కాచిగుడా నుండి ఆర్థిక సహాయము పొందేదని, కాని కరోన మహమ్మారి కారణంగా, వారు రెండేళ్ల నుండి సహాయాన్ని నిలిపివేశారని  కావున ఈ కఠినమైన రోజులలో తమ సాధారణ జీవితాన్ని కొనసాగించలేక పోవుచున్నామని శ్రీ ఉతునూరి వేణుగోపాల్ అభ్యర్థించగా ఈ క్రింద పేర్కొనబడిన దాతలు, సంస్థలు ముందుకు వచ్చి సహాయము చేశారు.

1. FAI (AiFA) వారు  కుటుంబానికి అవసరమైన వస్తువులను అమ్మాయి యొక్క గ్రాండ్ మదర్ ఆసుపత్రిలో చికిత్స పొందు సమయంలో సహాయపడి నారు.
2. ఐసిఐసిఐ బ్యాంక్ అధికారి మణిమాల  మరియు ఆమె కుటుంబ సభ్యులు పాఠశాల శిరీషా ఫీజు కోసం రూ .15 వేలు నేరుగా పాఠశాల యాజమాన్యానికి చెల్లించారు.
3. అవోపా బ్యాంక్‌మన్ చాపుటర్ అధ్యక్షుని స్నేహితుడు శ్రేయోభిలాషి మిస్టర్ ఎం.వి.పి రమేశ్ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దిక్సూచి పెట్టె మొదలైనవి (వాసవి కిట్) ఇచ్చారు. 
4. ఉపాధ్యక్షుడు శ్రీ మద్ధి హనుమంతరావు అమ్మాయికి దుస్తుల గురించి రూ .1116 లు సహాయం అంద జేశారు.
5. మణికొండ వాసవి సంక్షేమ సంఘం వారు ఆర్య వైశ్య సంఘం మణికొండ అధ్యక్షుడు శ్రీ రామలింగం గుప్తా, మండల అధ్యక్షుడు శ్రీ దేవిశెట్టి సుధాకర్, ఐసిఐసిఐ బ్యాంక్ అధికారి గార్లపాటి మనిమాల గారల సమిష్టి కృషి మరియు చురుకైన భాగస్వామ్యంతో శిరీశ కుటుంబానికి రూ .10,000 విలువైన రోజువారీ అవసరాలను అందజేశారు.
ఈ విధంగా బ్యాంక్‌మెన్ చాప్టర్ అవోపా దాని అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య, ఉపాధ్యక్షుడు శ్రీ  మద్ధి హనుమంతరావు గారల సమైక్య కృషితో  పాత నగరంలో నివసిస్తున్న ఆర్థికంగా వెనుక బడిన పేద ఆర్య వైశ్య కుటుంబానికి సహాయం అందజేయడం జరిగినది. కావున పై దాతలను తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.

కామెంట్‌లు