అవోపాలచే కోవాక్సిన్ టికాకు ఏర్పాట్లు

 

తెలంగాణ రాష్ట్ర అవోపా వారు కోవాక్సిన్ కరోన టికాను ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మరియు కోదాడ జిల్లా కేంద్రాలలో యశోదా హాస్పిటల్ మలక్ పేట వారి సౌజన్యంతో 18 సంవత్సరముల పైబడిన వారికి ఇచ్ఛుటకు యశోదా హాస్పిటల్స్ వారితో చర్చించి నూక యాదగిరి గారు ఏర్పాట్లు చేయనైనది. యథావిధిగా సింగిల్ డోస్ ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చుచున్న ధర  రూ.1200లు మాత్రమే ఛార్జ్ చేయబడును. కావున పై జిల్లా అవోపా అధ్యక్ష కార్యదర్శులు తగిన ఏర్పాట్లు చేసి, నివాసితులకు తెలియజేసి వారి పేర్లు నమోదు చేసుకుని తెలియ బరచినచో, సంబంధిత వైద్య విభాగ సిబ్బంది కావలసిన టికాలతో మీ జిల్లాకు వచ్చి టికాల కార్యక్రమము నిర్వహించెదరు. టీకా తీసుకో దలచిన వారు ఒక ఆధార్ కార్డ్ కాపీని విధిగా సమర్పించ వలయును. హాస్పిటల్  వారికి అడ్వాన్స్ గా ఎట్టి మొత్తము చెల్లించాల్సిన పని లేదు. టీకా తీసుకోనునప్పుడు మాత్రమే చెల్లించ వలయును. పైలెట్ ప్రాజెక్ట్ గా అవోపా కోదాడ లో తేదీ 7.6.2021 రోజున కాశినాథం ఫంక్షన్ హాల్ లో, 9.6.2021 రోజున మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో టీకా కార్యక్రమము ఏర్పాటు చేయనైనది. అవోపా నల్గొండ, సూర్యాపేట లో త్వరలో టీకా కార్యక్రమము ఏర్పాటు చేయబడుచున్నది.  అవోపా కోదాడ మరియు మిర్యాలగూడ అధ్యక్ష కార్యదర్శుల ను ఈ కార్యక్రమము నిర్వహించు యశోదా హాస్పిటల్స్ వారికి మరియు టీకా వేయించుకొనుటకు వచ్చుఁ వారికి తగిన వసతి సౌకర్యములు కోవిడ్ రూల్స్ ను అనుసరించి ఏర్పాటులు చేయవసలసినదిగా తెలంగాణ రాష్ట్ర అవోపా కోరుచున్నది. 

ఏ ఇతర అవోపా లైనా ఇలాంటి కార్యక్రమ మును చేపట్ట దలచినచో అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూక యాదగిరి గారిని 9949023236 ఫోన్ లో సంప్రదించగలరు. 

ఇట్లు

గంజి స్వరాజ్యబాబు,

అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అవోపా,

కామెంట్‌లు