అవోపా షాద్ నగర్ వారిచే నిత్యావసరాల పంపిణీ

 

అవోపా షాద్నగర్  ఆధ్వర్యంలో   ఆటో నడుపుకునే ఆర్యవైశ్య పేదలకు  నిత్యావసర వస్తువులు పంపిణీ దాతల సహకారంతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా  అవోపా అధ్యక్షులు mvs సురేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య బీదలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎంవీఎస్ సురేష్ ప్రధాన కార్యదర్శి కల్వ మాణిక్యం కోశాధికారి చెంచు గారి రాఘవేందర్ ఆర్యవైశ్య సలహా సంఘం సభ్యులు యంసాని శ్రీనివాసులు ఆర్యవైశ్య సలహా సంఘం   సభ్యులు పెద్ది రామ్మోహన్ డిస్టిక్ అవోపా కన్వీనర్ పెండ్యాల జగదీశ్వర్  అవోపా గౌరవాధ్యక్షులు గుడిపల్లి వెంకటరమణ వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్  వాడకట్టు విజయ్ కుమార్  రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అదనపు కోశాధికారి నీలరవీందర్, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి బాల రాజేశ్ అవోపా సభ్యుడు వేముల భాస్కర్  సభ్యుడు తాడిశెట్టి శ్రీకాంత్ కట్ట కృష్ణయ్య ఆర్యవైశ్య ఆటో డ్రైవరస్ తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ అవొపా చేస్తున్న ఇట్టి సేవకార్యక్రమాలు ఎంతో అభినందనీయం ఇంతటి క్లిష్ట పరిస్థితులు లో అధ్యక్షులు సురేష్ వారి కార్యవర్గం బీద వారికీ సహాయం అందించడం ఎంతో అభినందనీయమని  తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు మలిపెద్ది శంకర్, పోల శ్రీధర్, కలకొండ సూర్యనారాయణ, కొండూరు రాజయ్య తదితరులు తెలియజేశారు.

కామెంట్‌లు