నివాళి

 

 

ప్రఖ్యాత చిత్రకారుడు కి.శే మైదం చంద్రశేఖర్ అందరూ ప్రేమ గా పిలిచే "చంద్ర' కోవిడ్ మహమ్మారి  బారిన పడి బుధవారం రాత్రి సికింద్రాబాదు కార్ఖానాలోని ఆర్కె మదర్ థెరెసా రీహాబిలిటేషన్ సెంటర్ లో మృతి చెందారు. వీరికి మన ఆంధ్రప్రదేశ్ అవొపాతో కూడా మంచి సంబంధముందని గతంలో ఆంధ్ర ప్రదేశ్ అవోపా నిర్వహించిన వాసవీ ప్రభ కు కూడా వీరు ముఖ చిత్రాలు ఉచితంగా వేసిచ్చారని వాసవీ ప్రభ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారు, ఏ.పి.అవోపా పూర్వాధ్యక్షులు శ్రీ కాసం అంజయ్య గారు, శ్రీ పోకల చందర్ గారు  గుర్తు చేసుకుంటూ అవొపాకు ఉచిత సేవలందించిన వారి మృతికి వారితో బాటు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గంజి స్వరాజ్యబాబు, శ్రీ నిజాం వెంకటేశం శ్రీ చింతా బాలయ్య  రాష్ట్ర కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము నివాళులర్పిస్తూ వారి ఆత్మ శివైఖ్య మొందాలని ఆకాంక్షిస్తున్నవి.కామెంట్‌లు