నేటి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_03, ఏప్రియల్ , 2021_*                 *_స్థిర వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 

*_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. *_ఇష్టదైవారాధన మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఒక మంచి వార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది.  *_దైవారాధన మానవద్దు._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చతుర్థంలో చంద్ర స్థితి అనుకూలంగా లేదు. *_దుర్గాశ్లోకం చదివితే అన్ని విధాలా మంచిది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

  మీరు పని చేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. *_ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

 కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు జరుగుతుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

పట్టుదలతో పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. *_చంద్ర ధ్యానం శ్రేయోదాయకం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

 *_విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు