ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

14th MAR 2021 నుండి 20th MAR 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


వృషభరాశి 

--------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కొంతకాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు కొన్ని దగ్గరకు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


మిధునరాశి

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం కొన్ని వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి ఊహించని సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక దీర్ఘకాలిక సమస్య ఎట్టకేలకు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారి ఆశలు కొన్ని ఫలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.  ఏర్పడతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. 


సింహరాశి 

-------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది.  సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. మరపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. వ్యాపారాలలో భాగస్వాములు మీ సలహాలు పాటిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


కన్యారాశి

------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు ఆశించినంతగా అందుతాయి. ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి. కళారంగం వారి యత్నాలలో కదలికలు ఉంటాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


తులారాశి

-------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కవచ్చు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొన్ని సమస్యలు సవాలుగా మారవచ్చు. వ్యాపారాలలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులలో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. అప్పులు సైతం చేస్తారు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


ధనుస్సురాశి

-----------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల సాటిగా ఉంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు.  నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి.


మకరరాశి

-------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కుటుంబసమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి కొత్త పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


కుంభరాశి

-------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 


మీనరాశి

------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  ఉద్యోగాలలో మార్పులు సంతోషం కలిగిస్తాయి. కళారంగాల వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. 


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి


కామెంట్‌లు