ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

14th FEB 2021 నుండి 20th FEB 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తులు కొనుగోలులో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి 

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. బంధువులతో విభేదాలు. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. అవసరాలకు తగినట్లుగా డబ్బు అందుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా అధిగమిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యతిరేకులను అనుకూలురుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. 


కర్కాటకరాశి

------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం కుటుంబ సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. 


సింహరాశి :

----------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని పదవులు సైతం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అవసరాలు పెరిగినా సమయానికి డబ్బు అందుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. 


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజకనంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత రావచ్చు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు, ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు.  ధనప్రాప్తి.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి

---------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  బంధువులతో వివాదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 


ధనుస్సురాశి

------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి

-------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. 


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు.  ఇంటి నిర్మాణయత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. 


మీనరాశి

-------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది.  ఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు పెట్టుబడులు సమకూరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు