గౌరవ డాక్టరేట్ ప్రదానం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బిల్లకంటి సువర్ణలక్ష్మి, కృష్ణయ్య దంపతుల కుమారుడు, గణిత ఉపాధ్యాయుడికి నాగర్ కర్నూల్ అవోపా అధ్యక్షుడు  బిల్లకంటి రవికుమార్  సోషల్ సర్వీస్ విభాగంలో యునివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో  ఇండియన్ ఎంపెయిర్ యునివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ కె. ప్రభాకర్ చేతుల మీదుగా శనివారం తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేశారు.జిల్లా కేంద్రంలో విద్యనభ్యసించిన ఆయన అదే పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అవోపా జిల్లా అధ్యక్షులు గా శ్రీ సత్యసాయి సంస్థల సేవా దల్ జిల్లా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఆయన సోషల్ సర్వీస్ విభాగంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నిరుపేదలకు అండగా నిలిచిన రవికుమార్ ఇటివలే విశ్వాగురు ఐకాన్ అవార్డ్ ను అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు.సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సహకరించిన మిత్రులు శ్రేయోభిలాషులు యునివర్సిటీ అధ్యాపక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి అభినందనలు తెలియజేయుచున్నవి. 

కామెంట్‌లు