నేటి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 
*_శుభమస్తు_* 👌 
*_05, జనవరి , 2021_*                *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_* 
 
🐐 *_మేషం_*
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో  సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. *_నవగ్రహధ్యాన శ్లోకం చదవడం మంచిది_* 
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_* 
తలచిన కార్యాలు  నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు కలవు. *_సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది_*.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు.  *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి_* 
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషకరమైన కాలం ఉంది. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగేయండి. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది._* 
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
ఈరోజు
మీమీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతమవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. *_లక్ష్మీదేవి  సందర్శనం ఉత్తమ ఫలితాలన్నిస్తుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
కార్యసిద్ధి ఉంది.  మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా  మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. *_గురు ధ్యానం మంచిది._* 
💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. *_లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే ఇంకా బాగుంటుంది._* 
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
శుభకార్యక్రమాలలో పాల్గొని బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మీమీ రంగాల్లో  ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. *_నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది_* 
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. *_దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది._* 
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
మీమీ రంగాల్లో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు.  అవసరానికి సహాయం చేసేవారున్నారు. గతం కంటే మంచి సమయం. బంధు ప్రీతి కలదు. స్థిరాస్తి కి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. *_ఇష్టదైవానామస్మరణ ఉత్తమం_* 
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
మీమీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణమనోబలం కలిగి ఉంటారు. *_విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి._* 
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
మీమీ రంగాల్లో  విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._* 
🦈🦈🦈🦈🦈🦈🦈
                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 
                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు