నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_24, జనవరి , 2021_*                *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి.

 *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

మిశ్రమ ఫలితాలున్నాయి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించండి. శాంతంగా ఉండాలి. వివాదాల్లో తల దూర్చకండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

   దైవ బలం రక్షిస్తోంది. ముఖ్య నిర్ణయాల్లో ముందడుగు వేసేటప్పుడు తోటి వారి సలహాలు అవసరమవుతాయి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. నూతన వస్తు ప్రాప్తి ఉంది.

 *_ఈశ్వర సందర్శనం ఉత్తమం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

శుభ ఫలితాలున్నాయి. అందరినీ కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆవేశాలకు పోవద్దు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనుల్లో విజయం కోసం *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. 

 *_ఇష్ట దైవారాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

   అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయవద్దు.  *_సాయిబాబా నామాన్ని జపిస్తే ఉత్తమం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

 తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.

 *_శని శ్లోకం చదవాలి._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

 శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

బద్ధకించకుండా పనిచేస్తే కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. *_సూర్యాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు, వినోదాలతో ఆనందంగా గడుపుతారు. *_లక్ష్మీ ధ్యానం ఉత్తమం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

  ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. 

*_లింగాష్టకం చదవాలి._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు