ఈ వారం రాశి ఫలాలు

 



గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


వారఫలాలు

17th JAN 2021 నుండి 23rd JAN 2021 వరకు


మేషరాశి

------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి:-

ఈ వారం అత్యవసరంగా చేపట్టిన కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామికవర్గాలకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


వృషభరాశి 

---------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి:-

ఈ వారం రుణవిముక్తి కోసం చేసే యత్నాలు కొంత సఫలమవుతాయి. క్రమేపీ అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. చేపట్టిన పనులు కష్టసాధ్యమైనా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, శుభకార్యాలలో పాల్గొంటారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.


మిధునరాశి 

----------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం పలుకుబడి కొంత పెరుగుతుంది. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల కొనుగోలులలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాల విస్తరణలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. 


కర్కాటకరాశి

-----------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి:-

ఈ వారం వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి :

-----------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి:-

ఈ వారం కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి లాభం కలిగే సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి

-------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు.  సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. పారిశ్రామికవర్గాలకు అన్నింటా విజయమే. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి

--------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి:-

ఈ వారం ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నిర్ణయాలు సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు తీరతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి

----------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి:-

ఈ వారం కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తాయి. పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలించే సమయం. 


ధనుస్సురాశి

------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి:-

ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కష్టసాధ్యమైనా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి

------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి:-

ఈ వారం కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి

--------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి:-

ఈ వారం ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.

.

మీనరాశి

------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి:-

ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆరోగ్యం గతం కంటే కుదుటపడి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణ సాఫీగా సాగుతుంది. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు