ఈ వారం రాశి ఫలాలు

 

వారఫలాలు. 

By Dr KUMAR, PhD

Astrologer & Numerologist

-----------------------------------------------

03rd JAN 2021 నుండి 9th JAN 2021 వరకు


గమనిక

------------

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.


మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.


పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,మేషరాశి (Aries) 

-------------------------

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి


ఈ వారం కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. ఆర్థిక విషయాలు కొంత నిరాశపర్చినా అవసరాలు తీరతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు తలెత్తడంతో సతమతమవుతారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


వృషభరాశి ( Taurus)

-------------------------------

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి


ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో మీ ఉన్నతిని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి.మిధునరాశి ( Gemini)

--------------------------------

మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి


ఈ వారం వ్యయప్రయాసలతోనే కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. తరచు ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించక డీలాపడతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. మరిన్ని బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. 


కర్కాటకరాశి ( Cancer)

---------------------------------

పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి


ఈ వారం వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. పరిపరివిధాలుగా ఉండే ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలలో గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహాయపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


సింహరాశి (Leo) 

------------------------

మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి 


ఈ వారం ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహ, వాహనయోగాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని వివాదాలు నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


కన్యారాశి ( Virgo) 

---------------------------

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి


ఈ వారం ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులు నుంచి శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. కొత్త భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.


తులారాశి ( Libra) 

--------------------------

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి


ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణాల వేటలో పడతారు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. మీ శ్రమ కొన్ని వ్యవహారాలలో వృథా కాగల సూచనలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు. ధన, వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.


వృశ్చికరాశి ( Scorpio) 

---------------------------------

విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి


ఈ వారం అనుకున్న పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. సోదరులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబంలో నిర్భయంగా చెప్పగలుగుతారు. వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది.  శుభకార్యాలకు హాజరవుతారు. 


ధనుస్సురాశి ( Sagittarius) 

----------------------------------------

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి


ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 


మకరరాశి ( Capricorn) 

-----------------------------------

ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి


ఈ వారం కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఎటువంటి వివాదమైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని హోదాలు దక్కవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి.


కుంభరాశి ( Aquarius) 

--------------------------------

ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి


ఈ వారం ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం తప్ప ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. విద్యార్థులకు ప్రయత్నాలు మందగిస్తాయి. అన్ని వ్యవహారాలలోనూ యుక్తిగా మసలుకోవడం మంచిది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి కాగలరు.  శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.


మీనరాశి ( Pisces)

----------------------------

పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి


ఈ వారం బంధువులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వివాహాది వేడుకలు వాయిదా పడే అవకాశం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు కొంత వేధిస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.


గమనిక

---------------

మంచి ఫలితాల కోసం ప్రతిరోజూ దుర్గా అష్టోత్తరం చేయండి

కామెంట్‌లు