జోగుళాంబ గద్వాల జిల్లా అవోపా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా శ్రీ మరిడి శ్రీకాంత్ మరియు కార్యవర్గ సభ్యులను అభినందించి జిల్లా అవోపా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరము ఆర్యవైశ్యులకు పట్టణ ప్రజలకు వాసవి మాత దయవలన అందరికీ శుభాలు విజయాలు చేకూరాలని కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి జిల్లా అవోపా మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం అయినది రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పోలా శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారికి అగ్రవర్ణాల లో EWS 10% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు అయ్యేటట్లు చూడాలని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడమైనది ఎమ్మెల్యే గారు స్పందించి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడమైనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ కలకొండ సూర్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి