వైశ్య హాస్టల్ కు గాంధీ జీ పుస్తకాల బహూకరణ


ఈ రోజు కాచిగూడ వైశ్య హాస్టల్ కు తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఎలెక్ట్రికల్ ఇంజనీర్, సాహితీవేత్త, అనువాదకులు శ్రీ నిజామ్ వెంకటేశం గారు గాంధీజీ గారు వారి జీవిత కాలంలో రచించిన 100 సంపుటాల పుస్తకాల సిరీస్ ను బహుక రించారు. ఈ కార్యక్రమంలో వేలూరు రవీంద్రనాథ్ గుప్త, నిజామ్ వెంకటేశం, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ, వైశ్య హాస్టల్ ట్రస్టు కార్యదర్శి శ్రీ భాస్కర్ గుప్త,  వేలూరు శీలెందర్ గుప్త, ప్రెసిడెంట్, నాచం ప్రభాకర్, ఇంచార్జి సెక్రెటరీ, ఉప్పల రాజేశ్వ ర్, ట్రెజరర్, పొద్దుటూరి రమేశ్, చైర్మన్, లైబ్రరీ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ వ్రాసిన, భారత ప్రభుత్వము ప్రచురించిన 100 సంపుటాలను వైశ్య హాస్టల్ లైబ్రరికి  బహూకరించి నందులకు శ్రీ నిజామ్ వెంకటేశం గారిని వైశ్య హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గారు అభినందించారు. 


 


కామెంట్‌లు