పోకల పలుకులు


“నీ మంచితనం గురించి


ఇతరులకు చెప్పకు.


కారణం,వారు నమ్మరు.


నీ చెడును మరొకరికి తెలుపకు.


కారణం,దానికి మరికొంత జోడించి మనను బాధ పెడతారు.


కొంత మంది 


మీకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరు.


ఎందుకంటే,మీరు ఎంతవరకు 


ఎదిగి పోతారో అని వారి భయం.


అందరూ మెచ్చే క్వాలిటీలు మనలో లేకపోవచ్చు.


కానీ,మనను పోగొట్టుకునే వారు మాత్రం ఏదోరోజు


బాధపడతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.


మంచి కోసం మనిషి మారాలి.కానీ,


అవకాశం కోసం మనిషి మారకూడదు.లోకులు ఎంత సులభంగా స్తుతిస్తారో, అంత సులభంగా నిందిస్తారు.


కాబట్టి,


నేను,నాది అనే అహంకారం ఉండకూడదు.


ఇతరులకు చేసిన మంచి కొంచమైనా సరే, అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది.ప్రేమ, మంచితనంమనలో ఎంత ఉంటె బయటి ప్రపంచంలో అంత మనకు మంచి జరుగును.”*పోకల పలుకులు*


"Most of our problems are because we act without thinking or we keep thinking without acting."*pokala mantra*


కామెంట్‌లు