This is header
అవోపా హాబ్సిగూడ అధ్యక్షుని విజ్ఞప్తి


అవోపా హాబ్సిగూడ అధ్యక్షుడు ఈ క్రింది విధముగా తెలియజేయు చున్నారు. తాను ఒక బీద ఆర్యవైశ్య కుటుంబాన్ని దిల్సుక్ నగర్ లో కనుగొన్నానని, ఇంటి యజమాని సి.ఎచ్ మహేందర్ మెట్లపై నుండి పడగా వెన్నుముక విరిగినదనీ, శస్త్ర చికిత్స చేయించిన తరువాత రెండు కాళ్లు లేపలేక మంచం పై పడుకుని బాధ పడుచున్నారని, కుటుంబ పోషనార్థం అతని భార్య వంట పని చేస్తూ ఇద్దరు ఆడపిల్లలు గల కుటుంబాన్ని పోషిస్తున్నదని, కాని నెలసరి ఆమె భర్త వైద్యానికి డబ్బు చాలడం లేదని, దయామయులు ఆర్థిక సహాయం చేయగలరని విజ్ఞప్తి చేయు చున్నారు. సహాయం చేయ దలచిన వారు ఫోన్ నెం. 9290830940 ద్వారా గానీ లేదా వారిని ఇంటి నెం. 16-11-477/8, సాయి డిగ్రీ కళాశాల వద్ద, శాలివాహన నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లో గానీ కలిసి సహాయం అందించ గలరని కోరుతున్నారు.

ఇట్లు

ఆర్. శివకుమార్, అధ్యక్షుడు,                                 అవోపా హాబ్సిగూడ. 

This is footer
కామెంట్‌లు