నాగర్కర్నూల్ జిల్లా అవోపా వారిచే పదకొండవ ఆర్యవైశ్య వధూవరుల వర్చువల్ పరిచయ వేదిక

 

నాగర్కర్నూల్ జిల్లా అవోపా వారిచే పదకొండవ ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని నాగర్ కర్నూల్ గద్వాల మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సహాయం తో మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 యూనిట్ల బాధ్యులు కలిసి 600 మంది వధూవరుల వివరాలను సేకరించి ఒక చక్కటి కలర్ఫుల్ కరదీపిక ను తయారు చేయడం జరిగింది ఎక్కడ కూడా మాన్యువల్ వర్క్ చేయకుండా అంతా వర్చువల్ పద్ధతిలోనే ఈ కర దీపికను తయారు చేయడం విశేషం డిసెంబర్ 5, 6 తారీకులలో వర్చువల్ పద్ధతి ద్వారానే దాదాపు 20 గంటల సమయాన్ని తీసుకుని ప్రతి ఒక్కరిని తమను తాము పరిచయం చేసుకునే దిశగా ఏర్పాటు చేశాం ఈ పద్ధతి ద్వారా వధూవరులు తమను తాము పరిచయం చేసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపారు వర్చువల్ పద్ధతిలోకి అమెరికా ఆస్ట్రేలియా అయినా విదేశాల నుండి కూడా మన ఆర్యవైశ్య వధూవరులు పరిచయం చేసుకోవడం విశేషం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగాా ఇంత పెద్దయెత్తున వర్చువల్ పద్ధతిలో వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్య బాబు గారు వీరి యొక్క టీం బాగా ఉందని చక్కని ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశ్వర్లు గారు covid 19 కాలంలో సమయాన్ని వృధా చేయకుండా 600 మంది వధూవరులను పరిచయం చేయడం నిజంగా గర్వ కారణమని పోకల చందర్ రాష్ట్ర సలహాదారు గారు అభినందించారు. నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షులు బిల్లకంటి రవి కుమార్ గారి యొక్క కార్యదక్షత అభినందనీయమని  నూకఅవోపా లకు మార్గ దర్శకమని నూక యాదగిరి అవోపా న్యూస్ బులిటెన్ ఎడిటర్  గారు పేర్కొన్నారుు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా మ్యాట్రిమోనియల్ ఇన్చార్జిగా ఉంటూ చక్కటి ప్రణాళికకు రూపకల్పన చేసినటువంటి మల్లిపెద్ది శంకర్ గారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రావు గారు పదకొండవ వివాహ వధూవరుల పరిచయ వేదిక కరదీపిక ఆవిష్కరించారు. కలెక్టర్ ప్రోగ్రాంలో మన యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ గారు మహబూబ్ నగర్ జిల్లాఅధ్యక్షులు శ్రీకంది శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి పాపి శెట్టి మురళి కృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొండూరు రాజయ్య గారు మహబూబ్నగర్ జిల్లా యూనిట్ ప్రెసిడెంట్ అయినటువంటి B T ప్రకాష్ గారు కొండా చక్రధర్ గుప్త గారికి ముందుండి సహకరించినందుకు నాగర్ కర్నూలు జిల్లా అవోపా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.  నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్ గారు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ లో చక్కగా పాల్గొన్నారు. అధ్యక్ష కార్యదర్శి ప్రధాన కార్యదర్శి లు ముగ్గురు కలిసి నాగర్ కర్నూల్ అచ్చంపేట యూనిట్లలో తొలి కాపీని అందజేయడం జరిగింది కర్నూల్ లో శ్రీ పోలా శ్రీధర్ గారు మాట్లాడుతూ జిల్లా అవోపా నాగర్ కర్నూలు తన వినూత్న కార్యక్రమాలు అయినా కవి పరిచయం మాట్రిమోనియల్ మహాత్మా గాంధీ కాస్ట్యూమ్స్ షో మొదలైన కార్యక్రమాలు చేసి అందరిని అబ్బురపరిచింది అని తెలియజేశారు అచ్చంపేట లోని అధ్యక్షులు శ్రీ శివ రాములు పానుగంటి కృష్ణయ్య మరియు పాపి శెట్టి మురళీకృష్ణ గారు తాము ఎప్పుడూ కూడా జిల్లా Avopa కి సపోర్ట్ గా ఉంటామని అమ్మవారి దేవాలయంలో కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది కల్వకుర్తి అధ్యక్షులు శ్రీ కృష్ణయ్య గారు ప్రధాన కార్యదర్శి బిల్ల కంటి వెంకటేష్ గారుఆర్థిక కార్యదర్శి పాలుట్ల జంగయ్య గారు పోలావిజయ్ గారు రాష్ట్ర నాయకులు పాల నరసింహ గారు పదకొండవ ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక విజయవంతం అయినందుకు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. 




కామెంట్‌లు