అవోపా నాగర్ కర్నూలు వారి చే కుర్చీల బహుకరణ

 


నాగర్ కర్నూల్ యూనిట్ అవోపా అధ్యక్షుడు ఫణి కుమార్ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎర్రగడ్డ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్కెట్ లోని శివాలయం, రామ్ నగర్ లోని రామ స్వామి టెంపుల్ లో కుర్చీల వితరణ చేయడం జరిగింది. అలాగే వెంకటేశ్వరస్వామి హౌసింగ్ బోర్డ్ కాలనీ దేవాలయానికి వాటర్ ట్యాంక్ నీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలా శ్రీధర్, జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ మాట్లాడుతూ అవోపా ద్వారా వివాహ పరిచయ వేదిక లు ధార్మిక కార్యక్రమాలు విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని ఇంకా యువత సన్మార్గంలో ప్రయాణం చేసేటువంటిఎన్నో కార్యక్రమాలు చేయబడుతున్నది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కందూరి బాలరాజు దర్శి రాజయ్య కాసుల ప్రసాద్ సతీష్ నాగర్కర్నూల్ కార్యదర్శి ఏం సాయి శంకర్ రాఘవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవింద క్షేత్రం హౌసింగ్ బోర్డు వారు బిల్ల కంటి రవికుమార్ శ్రీధర్ ఫణికుమార్ సాయి శంకరులకు ఏడుకొండలవవారి ఆశీస్సులు అందజేశారు. 

కామెంట్‌లు