అవోపా నాగర్ కర్నూల్ అధ్యక్షుడు శ్రీ ఫణి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ మరియు సిబిఎస్ఇ పదవ తరగతు లలో ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులకు వెండి పతకాలు సర్టిఫికెట్ల తో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్ గారు హాజరై విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని పెంచుకొని సేవాభావం అలవర్చుకోవాలని కోరినారు. అధ్యక్షుడు ఫణి కుమార్ తో పాటు జిల్లా కోశాధికారి ఇమ్మడి దేవేందర్ సీనియర్ సలహాదారులు బొడ్డు పాండు, ఆర్ వెంకట రాజా, దర్శి రాజయ్య మరియు అవోపా ప్రధాన కార్యదర్శి సాయి శంకర్, వాస రాఘవేందర్ ,కార్యవర్గ సభ్యులు కె.పి ప్రసాదు, రాఘవేంద్ర స్వామి సతీష్ కుమార్, రామ్మోహన్, విష్ణుమూర్తి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సభ్యులందరికీ ఫణి కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి