నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_23, డిసెంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత కోసం 

*_శివ నామాన్ని జపించడం ఉత్తమం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

శుభకాలం. అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. *_ఇష్టదైవారాధన చేస్తే మంచిది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోనివిధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మనశాంతిని తగ్గిస్తుంది. 

*_ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

 మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_శివనామాన్ని జపించాలి._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

 మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_శ్రీవారి సందర్శనం శుభప్రదం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. మొదలుపెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అక్కరకు వస్తాయి. ఉద్యోగంలో మీపై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. *_దుర్గా ధ్యానం శుభప్రదం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంతచిత్తంతో ముందుకుసాగితే అన్నీ సర్దుకుంటాయి. 

*_సూర్య ఆరాధన మంచినిస్తుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. 

*_ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారములో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 

*_శివుడిని ఆరాధిస్తే మంచిది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం . మనోబలం పెరగటానికి 

*_లక్ష్మి ధ్యానం శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. 

*_ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు