నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు

 

ఆత్మకూరు అవోపా నూతన అధ్యక్షులు గా బిలకంటి పరమేష్ ఎన్నికైనట్లు వనపర్తి జిల్లా అద్యక్షులు గుమ్మడవెళ్లి మహేష్ గారిచే ధ్రువీకరణ పత్రం అందజేశారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి దోమ శ్రీనివాస్, ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, జిల్లా అవోపా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, వనపర్తి పట్టణ అవోపా అధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాసులు గారు మరియు ఇతర జిల్లా బాధ్యులు, ఆత్మకూరు అవోపా సభ్యులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ఆత్మకూరు అవోపా అధ్యక్షునికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి.

కామెంట్‌లు