ఈ వారం రాశి ఫలాలు

 


వారఫలాలు. 

By Dr KUMAR, PhD
Astrologer & Numerologist
-----------------------------------------------
27th DEC 2020 నుండి 02nd JAN 2021 వరక

గమనిక
------------
ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టిలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.

మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.

పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు,


మేషరాశి (Aries) 
-------------------------
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి

ఈ వారం కుటుంబంలో మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగి, అనుకోని హోదాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.

వృషభరాశి ( Taurus)
-------------------------------
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కే సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. 


మిధునరాశి ( Gemini)
--------------------------------
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలలో భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులు, బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. చిరకాల ప్రత్యర్థులను మీ దారికి తెచ్చుకుంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి.

కర్కాటకరాశి ( Cancer) 
----------------------------------
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి

ఈ వారం వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి కీలక సమాచారం. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.

సింహరాశి (Leo) 
-------------------------
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :

ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.

కన్యారాశి ( Virgo) 
---------------------------
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి

ఈ వారం వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది.. పారిశ్రామికవర్గాలకు కొత్త కంపెనీల ఏర్పాటులో విజయం. ఊహించని విధంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి.

తులారాశి ( Libra) 
---------------------------
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి

ఈ వారం ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు విశేష గుర్తింపు లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి.

వృశ్చికరాశి ( Scorpio) 
---------------------------------
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి

ఈ వారం నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 

ధనుస్సురాశి ( Sagittarius) 
----------------------------------------
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి

ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతచాయి. కళాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. 

మకరరాశి ( Capricorn)
----------------------------------
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి

ఈ వారం ఉద్యోగాలలో మరింత పనిభారం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తుల విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 27 ప్రదక్షిణలు చేయండి, 

కుంభరాశి ( Aquarius) 
----------------------------------
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి

ఈ వారం పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అనూహ్యంగా పుంజుకుంటాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది, అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆర్థిక పరిస్థితిలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో అత్యంత కీలక విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించండి.

మీనరాశి ( Pisces)
----------------------------
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి

ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శత్రువులే మిత్రులుగా మారతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి.

కామెంట్‌లు