తేదీ 15.12.2020 రోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 69 వ వర్ధంతిని జిల్లా అవోపా & పట్టణ అవోపా ఆధ్వర్యంలో లక్సీట్టిపెట్ లో గాంధీ చౌక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవోపా నాయకులు పూల మాలంకరణ గావించి 2 నిముషములు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవము, భాషా యుక్త రాష్ట్రాల కొరకు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను సైతము త్యాగము చేసిన గొప్ప మహానీయుడని గాంధీజీ తొ కలిసి స్వతంత్రోద్యమము లో పాల్గొన్న మహానీయుడని జిల్లా అధ్యక్షులు గుండ సత్యనారాయణ గారు వారిని కొనియాడారు, జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాలకుర్తి సుధర్శన్ రాష్ర్ట అవొప నాయకులు గుండ ప్రభాకర్ వొజ్జెల రాజ మౌళి జిల్లా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి చెట్ల రమేష్ జిల్లా పట్టణ అవొప ప్రధాన కార్యదర్శులు k. కిషన్ అక్కన పెల్లి రవీందర్ జిల్లా కోశాధికారి రాచర్ల సత్యనారాయణ జిల్లా అవొప ఉపాధ్యక్షులు పాలకుర్తి వెంకటేశ్వర్లు రాష్ట్ర అవోపా కార్య వర్గ సభ్యులు కొంజర్ల శ్రీనివాస్ అవోపా పట్టణ కార్యదర్శులు రావుల రాజమౌళి గుండ సంతోష్ అవొప సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి కి నివాళులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి