నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_02, డిసెంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మంచిది_* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


తలపెట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు తగిన ధనం చేకూరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. *_ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మంచిది._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. *_లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠిస్తే శుభప్రదం_* .


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శివారాధన ఉత్తమం. శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. *_నవగ్రహ శ్లోకం చదవితే శ్రేయోదాయకం_*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


అవసరానికి తగిన ఆర్థిక సాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలున్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. *_లక్ష్మీదేవి ఆలయ సందర్శనం ఉత్తమం._*   


 ⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనః సౌఖ్యం ఉంది. *_నవగ్రహ ధ్యానం శుభదాయకం._*  


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మనః సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలితాలనిస్తుంది._*   


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


శుభకాలం ఉంది. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. *_ఆదిత్య హృదయం చదివితే మంచిది_* . 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. *_ఇష్ట దైవాన్ని స్మరించండి._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మంచి ఫలితాలున్నాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_గోవిందా నామాలు పఠిస్తే శుభప్రదం_*  


 🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు