అవోపా కరీంనగర్ భవన నిర్మాణ భూమి పూజ


తేది 21.11.2020 రోజున టౌన్ అవోపా అధ్యక్షుడు శ్రీ కట్కూరి సుధాకర్ గారి అధ్వర్యంలో అవోపా భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఉదయము 5.00 గంటల కు జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్య బాబు, ఉపాధ్యక్షులు శ్రీ సామా నారాయణ, అవోపా జిల్లా అధ్యక్షులు శ్రీ. పి. వి. రామకృష్ణ, కార్యదర్శి కొండూరు శ్రీనివాస్, పట్టణ అవోపా కార్యదర్శి శ్రీ నివాస గాంధీ కార్యవర్గ సభ్యులు, చందాదారులు, అవోపా సభ్యులు జిల్లా అంజయ్య, బి. లక్ష్మినారాయణ, మంచాల కిషన్ పాత రాధా కిషన్, యాంసాని భద్రయ్య, గణేష్, చామ మహేష్, పాత విశ్వనాథం, లక్ష్మీ కాంతం, పాత గంగాధర్, జిల్లా కృష్ణమూర్తి, డాక్టర్ నారు మల్ల లక్ష్మణ మూర్తి, ప్రదీప్, పుల్లూరి రమేష్ మొదలగువారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కామెంట్‌లు