🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_18, నవంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ప్రారంభించే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. *_శివ సహస్రనామ పారాయణ వల్ల అంతా మంచే జరుగుతుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. *_ఇష్టదైవ ప్రార్ధన శుభం_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆదిత్య హృదయం చదవడం మంచిది._* .
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_సుందరకాండ పారాయణ శుభప్రదం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనలు మంచి చేస్తాయి. ధర్మసిద్ధి ఉంది. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. *_లక్ష్మీదేవి దర్శనం శుభాన్ని కలిగిస్తుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. ధర్మ కార్యక్రమాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సాయం చేసేవారుంటారు. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
దైవబలం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. *_ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని కలిగిస్తుంది_* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యవిషయాల్లో తోటివారి సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సహకారం ఉంటుంది. *_ఈశ్వరారాధన శుభప్రదం_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. *_దైవారాధన మానవద్దు._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సహకారంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి_*.
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి