అవోప బ్యాంక్ మెన్ ఛాప్టర్ వారి దృశ్య శ్రవణ వివాహ పరిచయ వేదిక


అవోప బ్యాంక్ మెన్ ఛాప్టర్ వారు 2020 నవంబరు ఒకటవ తేదీన జయప్రదంగా నిర్వహించిన రెండవ దృశ్య శ్రవణ (ఆన్ లైన్) వివాహ పరిచయ వేదిక లో 111మంది ఆసక్తి పరులైన యువతీ యువకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోప - ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ నిజాం వెంకటేశం గారు , పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు, హైదరాబాద్ వాసవి కాలని అష్టలక్ష్మి దేవాలయ ఛైర్మన్ శ్రీ గౌరిశెట్టి చంద్రశేఖర్ గారు కార్యక్రమంలో పాల్గొనేవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం పదిగంటలకు మొదలైన ఈ కార్యక్రమానికి అవోప బ్యాంక్ మెన్ ఛాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య గారు స్వాగతోపన్యాసం చేశారు. కె.రామానందం గారు మారిన సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో పరిచయ వేదిక అవసరం, ప్రాముఖ్యత ను వివరించారు. శ్రీమతి గ్రంధి శ్రీఅంశ, శ్రీమతి ఎ.వి.యస్. భవాని, శ్రీమతి మణిమాల , శ్రీ గర్రె మురళి కృష్ణ గారలు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. నిర్వహణ బాధ్యత శ్రీ గ్రంధి రమేశ్ గారు వహించారు. సాంకేతిక సహకారం శ్రీ వి. సోమశేఖర్ గారు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతి యువకులు, వారి తల్లిదండ్రులు కార్యక్రమ నిర్వహణ , ప్రయోజనంపట్ల తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శ్రీ తూనుగుంట్ల లక్ష్మి వెంకటేశ్వరరావు గారు వందనసమర్పణ గావించారు.


 


కామెంట్‌లు