బి.టేక్ విద్యార్థిని కి ఆర్థిక సహాయం


అవోపా నాగర్ కర్నూల్ అధ్యక్షుడు ఆకారపు ఫణికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో బీటెక్ మూడవ సంవత్సరం విద్యార్థిని కుమారి తేజస్విని D/o శ్రీనివాసులు అనే అమ్మాయికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ చైర్మన్ శ్రీ వాస ఈశ్వరయ్య గారి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ వాస పాండురంగ య్యగారు, అవోపా నాగర్కర్నూల్  కార్యదర్శులు మాచిపెద్ది సాయి శంకర్, రవి ప్రకాష్, సలహాదారులు సభ్యులు దర్శి రాజయ్య సూరంపల్లి రాధాకృష్ణ, వాస రాఘవేందర్ రామకృష్ణ, వాస రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు