అభినందనలు


కామారెడ్డి పట్టణంలో ల‌యోల‌ స్కూల్ దగ్గర శ్రీనివాస అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న కొమ్మ శ్రీనివాస్ భాగ్య ల కుమారుడు చిరంజీవి రోహన్ రాజ‌ నిన్న విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో 398 వ ర్యాంకు, నేడు విడుదల చేసిన ఎంసెట్ ఫలితాలు 113 వ ర్యాంకు సాధించి తన అద్భుతమైన ప్రతిభను క‌న‌బ‌ర‌చారు . చిరంజీవి రోహన్ తాత గారు శ్రీ కొమ్మ శంకరయ్య గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలోని పదవి విరమణ పొంది ఉన్నారు. శ్రీనివాస్ గారు శాబ్దిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, త‌ల్లి భాగ్య గృహిణిగా ఉంటూ తమ కుమారుడికి మంచి ర్యాంకు వచ్చే విధంంగా ప్రోత్సహించినందులకు తల్లిదండ్రులకు, వారి ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉత్తమమైన ర్యాంకులను సాధించినందుకు గాను రోహ‌న్ రాజాకు అభినంద‌న‌లు.


అలాగే జాతీయస్థాయిలో 1970వ ర్యాంకు దివ్యాంగుల కోటలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి నేడు విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 489 ర్యాంకుతో ఎన్జీవోస్ కాలనీలో నివ‌సిస్తున్న‌ కందుకూరి సునిల్ ‍త్రివేణి దంపతుల కుమారుడు విశ్వేశ్వర్ విజయకేతనం ఎగరేయ‌డం జ‌రిగింది. సునీల్ గారు వ్యాపారవేత్త, త్రివేణి గారు గృహిణి మంచి ర్యాంకు వచ్చే విధంగా ప్రోత్సహించినందులకు తల్లిదండ్రులకు, వారి ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉత్తమమైన ర్యాంకులను సాధించినందుకు గాను విశ్వేశ్వర్ కు అభినంద‌న‌లు.


వీరిరువురు రాబోవు కాలంలో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి కామారెడ్డి పేరును జాతీయ స్థాయిలో నిలపాలని ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కామారెడ్డి (అవోపా కామారెడ్డి) తరఫున అధ్యక్షులు శ్రీ సంతోష్ కుమార్ , ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు అభినందనలు తెలియ జేయుచున్నారు. 


వీరిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కష్ట పడాలని వారి భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకోవాలని వీరు మరేందరికో స్ఫూర్తి ప్రదాతలు కావాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలశిస్తున్నవి. 


కామెంట్‌లు