వాసవి మాత దేవాలయానికి కుర్చీల సమర్పణ

అవోపా నాగర్ కర్నూల్ వారు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి 18000/- విలువ గల 25 కుర్చీలు సమర్పించడం జరిగింది.


    నాగర్ కర్నూల్  పట్టణ అవోపా అధ్యక్షుడు శ్రీ ఆకారపు ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ వాస ఈశ్వరయ్య గారు, కోశాధికారి సూరంపల్లి రాధాకృష్ణ గారు, అవోపా కార్యదర్శులు మాచిపెద్ది సాయి శంకర్,  ఇందువాసి రవి ప్రకాష్ మరియు రాష్ట్ర అవోపా బాధ్యులు వాసు పాండు రంగయ్య గారు, అవోపా సలహాదారులు దర్శి రాజయ్య , వాస రాఘవేందర్, రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు వాస రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్ష పరోక్షంగా సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అధ్యక్షుడు, అవోపా, నాగర్ కర్నూల్ వారు తెలియజేశారు. 
కామెంట్‌లు