అభినందనలు


తేది 5th అక్టోబర్ 2020 రోజున అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా అవోపా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ ఆముదాల నరసింహ స్వామి గారికి ఘనంగా సన్మానించడం అయినది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరిడి శ్రీకాంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది, జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించేది ఉపాధ్యాయుడు అని మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డకు రాష్ట్రస్థాయి అవార్డు రావడం మన ఆర్యవైశ్యులకు గర్వకారణమని కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో  అధ్యక్షులు మరిది శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు


కామెంట్‌లు