వర్చువల్ మహాత్మాగాంధీ కాస్ట్యూమ్స షో


నాగర్ కర్నూలు జిల్లా అవోపా ఆధ్వర్యంలో చేపట్టిన వర్చువల్ మహాత్మాగాంధీ కాస్ట్యూమ్స షో విజయవంతమైందని జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవి కుమార్, ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని చిన్నారులు గాంధీ వేషధారణతో అలరించారు. వీరందరికీ ఆన్లైన్లో సర్టిఫికెట్స్ పంపించడం జరుగుతుందని మహాత్మా గాంధీమా కాస్ట్యూమ్స్ కన్వీనర్ కందుకూరి బాలరాజు, డాక్టర్ పోల సాయి జ్యోతి తెలిపారుు. ఈ సందర్భంగా వేషధారణ షో వీడియోను రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీధర్ గారు ఆవిష్కరించారుు. బిల్లకంటి రవి కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో చాలా మంచి మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నాయని అలాగే వివాహ పరిచయ వేదిక కార్యక్రమం కూడా విజయవంతం కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షులు ఫణి కుమార్, ఆర్థిక కార్యదర్శి రవి ప్రకాష్, బొడ్డు పాండు, కిషోర్, రాచూరి వెంకట రాజు, మిర్యాల శ్రీనివాసులుు, కొండూరు మహేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 


వర్చువల్ మహాత్మాగాంధీ కాస్ట్యూమ్స షో


కామెంట్‌లు