అవోపా హైదరాబాద్ వారి సహాయ కార్యక్రమాలు


అవోపా హైదరాబాద్ వారు ఈ నెలలో ఈ క్రింది సేవా కార్యా క్రమాలు చేపట్టినారు. 


సేవా కార్యా క్రమము 1: సెప్టెంబర్ 5 వ తేదిన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవోపా హైదరాబాద్ వారు 14 ఆర్థికంగా వెనక బడిన మరియు బీద  ఆర్యవైశ్య కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 2500/- ల చొప్పున మొత్తం రూ 35,000 ల ఆర్థిక సహాయం అందజేశారు. 


సేవా కార్యా క్రమము 2: అవోపా హైదరాబాద్ వారి విజ్ఞప్తి మేరకు గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారు రూ 1.50 లక్షలు మహాబుబ్‌నగర్ నివాసి శ్రీ శ్రీనివాసులు ఆపరేషన్ కోసం సిఎం కేర్ ఫండ్ నుండి విడుదల చేయించారు. ఈ రోజు నిమ్స్ డాక్టర్ శ్రీ చంద్రశేఖర్  గారు చేసిన తుది శస్త్రచికిత్స విజయవంతమైందని, రోగి బాగానే ఉన్నారని తెలియ జేశారు. అద్భుతమైన ఈ సేవా కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన ప్రాజెక్టు చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ గారిని అభినందిస్తూ మన కమ్యూనిటీ ప్రజలకు పై విధంగా మరింత మందికి సహాయం చేయడానికి అందరూ చేతులు కలపండని  అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ నమఃశివాయ గారు విజ్ఞప్తి చేయు చున్నారు.


కామెంట్‌లు