అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ వారి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు


అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరము కూడా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు తేదీ 12.08.2020 సాయంత్రం 7.00గం.ల నుండి 9.30వరకు ఆన్ లైన్ లో జూమ్ అనువర్తనం ద్వారా నిర్వహించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 28 మంది చిన్నారులు రెండు నుండి 6 సంవత్సరాల వయసు గల వారు 16 మంది 'ఏ' గ్రూపులో, మరియు 7 నుండి 15 సంవత్సరాల వయసువారు 12 మంది 'బి' గ్రూవు లో పాల్గొని చిన్ని కృష్ణుని వేష ధారణలతో పాటలు పద్యాలు కీర్తనలు పాడి, ఆడి ప్రేక్షకులను భక్తి ప్రేమ రసమయ సాగరంలో ముంచెత్తారు. ఇరు గ్రూపుల లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మరియు మూడు ప్రోత్సాహక బహుమతులుగా మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించారు. ఇందుకు న్యాయ నిర్ణేతలుగా శ్రీమతి కవితా అజయ్ గాయని మరియు కవి, శ్రీ మతి వై అనూరాధ తెలుగు రచయిత్రి మరియు శ్రీ మతి ఏ. ఎస్. భవానీ బియస్ యన్ యల్ రిటైర్డ్ అధికారిణి గారలు సంయుక్తంగా విజేతలను ప్రకటించారు. దాదాపు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వాసవీ మాత పూజ మరియు మణిమాల గారి ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమం ప్రారంభమై శ్రీమతి కవిత అజయ్ గారి మధుర మనోరంజక గీతాలతో శ్రీ పి. వి రమణయ్య గారి తొలిపలుకులతో, శ్రీ TLV Rao గారు ప్రోగ్రాం ఏక్జిక్యూటివ్ గా, K. రామానందం గారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా, రమేష్ గ్రంధి మరియు వంకదారి సోమ శేఖర్ గారల సహకారంతో, శ్రీ రామానందం గారి వందన సమర్పణతో కవితా అజయ్ జనగణమన జాతీయ గీతంతో గోకులాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి.


కామెంట్‌లు