జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పద్మప్రియ


ప్రతి ఉపాధ్యాయుని బాధ్యత మొదట విద్యార్థుల మనస్తత్వాలను అర్ధం చేసుకోవడం, తర్వాత వారిలో భయాన్ని పోగొట్టడం. అప్పుడే విద్యార్థులు పాఠాలను సులువుగా అర్థం చేసుకోగలరు. హైదరాబాద్ మలక్పేట లోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేయు గణిత ఉపాధ్యాయిని పద్మప్రియ ఈ విధానాన్ని పాటించి ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తిర్ణులగునట్లు కృషి చేశారు. ఆమె కృషి వృధా పోలేదు. ఏకంగా జాతీయ పుర స్కారమే దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను 2020 సంవ త్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 47 మందికి పురస్కారాలు ప్రకటించగా, రాష్ట్రం నుంచి ఆమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం. నల్గొండ జిల్లాకు చెందిన పద్మప్రియ 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్(ఏస్.జి.టి)గా ఎంపికయ్యారు. 1999లో ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి స్కూల్ అసిస్టెంట్(ఎస్.ఏ)గా ఎంపికయ్యారు. అప్పటి నుంచీ గణితం బోధిస్తున్నారు. ప్రస్తుతం మలక్ పేట లో పనిచేస్తున్నారు. గత పదేళ్లలో ఆమె బోధించిన పదో తరగతిలో గణితంలో విద్యార్థుల ఉత్తీర్ణత సగటు 94 శాతం. అందులో నాలుగేళ్లు 100 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. టీచర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద 2016లో భారత్ నుంచి అమెరికా వెళ్లి శిక్షణ పొందిన ఏడుగురు ఉపాధ్యాయులలో పద్మ ప్రియ ఒకరు. అమెరికాలోని తరగతి గదులను స్కైప్ ద్వారా అనుసంధానించి, తన విద్యార్థులకు అక్కడి నుండి పాఠాలు వినిపించారు. 'లెక్కలంటే భయపడే విద్యార్థులలో సైతం కొద్ది నెలల్లో చాలా మార్పు తేగలిగారు. ఆమె పనిచేసే పాఠశాలలకు అమెరికా నుంచి ఇప్పటివరకు ముగ్గురు ఉపాధ్యాయులను ఆహ్వానించి ఏడాది పాటు పాఠాలు చెప్పించగా, వారు పాఠశాలకు రెండు ప్రొజెక్టర్లు, ఒక కంప్యూటర్ విరాళంగా ఇచ్చారు. పాఠశాల బృందం సమష్టి కృషి వల్లే జాతీయ పురస్కారం లభించిందంటారు పద్మప్రియ. విద్యారంగం లో ఇంతటి కృషి సల్పిన పద్మప్రియను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.


కామెంట్‌లు