ప్రేమ నిజాయితీ పై నిజాం గారి ప్రసంగం


తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి, రచయిత, అనువాదకులు, సామాజిక కార్యకర్త, పుస్తక ప్రియులు శ్రీ నిజాం వెంకటేశం గారు విజయీభవ మానసిక వికాస సమూహం వారు నిర్వహించిన ఫేసుబుక్ ఆన్లైన్ షో లో *"ప్రేమ, నిజాయితీతో జివిద్దాం"* అను అంశం పై తేదీ 9.7.2020 రోజున అద్భుత ప్రసంగం చేశారు. వీరి ప్రసంగం ఆధ్యంతం మంచి రసవత్తరంగా సాగి శ్రోతలకు శ్రవనానందం కలిగించింది. వీరు ఉదహరించిన మహానుభావుల కొటేషన్స్ ఎంతో భావ గర్భితంగా నుండి వారి అంతరాత్మల ప్రభోదంగా గోచరించింది. వీరు సహజంగా పుస్తక ప్రియులైనందున అనేక మంది మహామహుల భావాజాలాన్ని, వారి ప్రేమ తత్వాన్ని పూసగుచ్చినట్లు వివరించడం వారి ప్రత్యేకత. ప్రేమతత్వంతో ఎంతటి పనినైనా అవలీలగా సాధించవచ్చని, నిజాయితీగా మెలిగితే అత్యంత ఉన్నత శిఖరాలనదిరోహించ వచ్చని, నిజాయితీతో ప్రతి ఒక్కరికి సహాయపడాలని, ఎవ్వరు కోరినా వెంటనే స్పందించాలని చాలా గొప్పగా వివరించారు. మంచి విషయంతో వీడియో చేసి బహుముఖ ప్రజ్ఞావంతుల, రచయితల భావాలను, ప్రేమతత్వాన్ని విశద పరచిన శ్రీ నిజాం వెంకటేశం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి.  నిజాం గారి ప్రసంగం


కామెంట్‌లు