కరోనా నివారణకు హోమియో మందుల పంపిణీ

 పంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మంచిర్యాల పట్టణంలో వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందు జాగ్రత్తగా హోమియో మందులను మంచిర్యాల ఆవోపా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు కొనియాడారు. బుధవారం స్థానిక రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పలువురికి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న హోమియో మందులను స్వయంగా పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి అని వైద్యులు సూచించిన భౌతిక దూరం పాటించాలని, మాస్కు తప్పని సరిగా ధరించాలి అని కోరారు. ఆవోపా తలపెట్టిన ఈ కార్యక్రమం వల్ల మంచిర్యాల లోని 25 వేల కుటుంబాలకు కరోణ రాకుండా ముందు జాగ్రత్తగా హోమియో మందులను పంపిణీ చేయడానికి ముందుకు రావడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు వెయ్యి మందికి హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లు దశలవారీగా పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రజలకు ప్రతి కుటుంబానికి ఈ ముందు జాగ్రత్తగా హోమియో మందులను పంపిణీ చేస్తామని రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు . ఈ కార్యక్రమంలో మంచిర్యాల పురపాలక సంఘం చైర్ పర్సన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ , ఆవోపా మంచిర్యాల అధ్యక్షులు తంగళ్ళపల్లి సత్య వర్ధన్ , ప్రధాన కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నేరెళ్ల శ్రీనివాస్, హోమియోపతి ప్రముఖ వైద్యులు డాక్టర్ కండే కృష్ణ , ఆవోపా సభ్యులు పల్లెర్ల శ్రీహరి, కేశెట్టి నారాయణ, కుక్కుడపు రాములు , బల్లు శంకర్ లింగం, గుండా సుధాకర్ , కాసం మల్లికార్జున్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నడిపల్లి విజిత్ తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు