వాసవి హాస్పిటల్ లొ కోవిద్-19 సేవలు ప్రారంభం

.


                                


కరోనా మహమ్మారి జనజీవితాలను అతలాకుతలం చేయుచున్న సందర్భంలో ఆర్య వైశ్య వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరియు రోజు వారీ ఆదాయం గల పేద ఆర్యవైశ్యులు తప్పని సరిగా విధులు నిర్వర్తించ వలసి వస్తున్నందున కరోనా బారిన పడుచున్నారు. కావున మెరుగైన వైద్యం కోసం తేది 15.7.2020 నుండి ఖైరతాబాదు లోని వాసవి హాస్పిటల్లో కరోనా వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఐ.వి.ఎఫ్ అధ్యక్షులు, వాసవి హాస్పిటల్ కోశాధికారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య సోదరులంతా, ఆవొపా సభ్యులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కరోనా కు భయపడే అవసరం లేదని అన్నారు. ఆర్యవైశ్య లకు ప్రాధాన్యత చికిత్సలు చేపట్టనున్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ రోజు నుండి వాసవి హాస్పిటల్ వారు కోవిద్ వైద్య సేవలు ప్రారంభిస్తున్న సందర్భంలో వాసవీ హాస్పిటల్ చైర్మన్ శ్రీ గంజి గంజి రాజమౌళి గుప్త,  ప్రధాన కార్యదర్శి కక్కిరాల రమేశ్ మరియు కోశాధికారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారలకు తెలంగాణ రాష్ట్ర ఆవోపా ఆధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు వారి కమిటి  మరియు అవొపా న్యూస్ బులెటిన్ ఎడిటర్లు ఆభినందనలు తెలియజేస్తూ రాష్ట్రం లొని అన్ని అవోపాల అధ్యక్ష కార్యదర్శులను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొనుటకు  వారి వారి సభ్యులకు తెలియజేయవలసినదిగా  కోరుచున్నారు.


కామెంట్‌లు