కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు కు నివాళి

                                


తేదీ 21-06-2020 రోజున కరీంనగర్ అవోపా ఆధ్వర్యంలో గాల్వాన్ లోయలో చైనా భారత్ ఘర్షణలో వీరోచితంగా పోరాడి పాణాలు అర్పించిన కల్నల్ బిక్కుమల్ల సంతోశ్ బాబుకు కొవ్వొత్తులతో నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ అవోపా అధ్యక్షుడు కట్కూరి సుధాకర్ మాట్లాడుచూ కల్నల్ సంతోష్ గుప్తా తండ్రిగారైన  బిక్కుమల్ల ఉపేందర్ గారు కరీంనగర్ స్టేట్ బ్యాంక్ లో పనిచేశే సమయంలో అవోపా కరీంనగర్ సభ్యత్వం తీసుకున్నారని వారు టౌన్ అవోపా జీవితకాల సభ్యుడని తెలిపినారు. పిదప ఇదే సమావేశంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి గోడపత్రికను విడుదలజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు, సలహాదారు తోట లక్ష్మణ్ రావు, కరీంనగర్ పట్టణ అవోపా అధ్యక్షుడు కట్కూరి సుధాకర్, జిల్లా అవోపా అధ్యక్షులు పి.వి రామకృష్ణ,  కార్యదర్శులు కొండూరి శ్రీనివాస్, శ్రీనివాస్ గాంధీ, అవోపా సభ్యులు రాధాకిషన్, మహేశ్వర్, కోమురవెళ్లి వెంకటేష్, నరహరి, జిల్లా అంజయ్య, లక్ష్మీనారాయణ, సతీష్, విశ్వనాథం, పాలేపు భూమయ్య  మెదలగు వారు పాల్గొన్నారు. 


 


కామెంట్‌లు