దీర్ఘకాలిక లాక్ డౌన్ నేపధ్యంలో పెళ్లిళ్లు, పేరంటాలు, నామకరణాల లాంటి తంతు పూర్తి చేసి దీర్ఘాయుష్మాన్ భవ, సర్వేజన సుఖినోభవంతు అని ఆశీర్వదించి సంభావన పుచ్చుకునే పూజారులు, పౌరోహిత్యం మీదనే ఆధారపడిన పేద బ్రాహ్మణ కుటుంబాలు నేడు అలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో ఉదర పోషణార్థం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులకు వారికి సహాయపడాలనే ఉద్దేశ్యముతో తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి, కరీంనగర్ వృధ్ధాశ్రమ ట్రస్టీ, శ్రీ అన్నపూర్ణ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్రాంత సీనియర్ బ్యాంక్ మ్యానేజెర్ పాత వెంకటనర్సయ్య గారు 50 మంది పేద బ్రాహ్మణులకు (1,000 చొప్పున 50 మందికి) 50,000 రూపాయల నిత్యావసర వస్తువులు నేడు12.05.2020 రోజున ఉదయం 9.00 గం. లకు టవర్ సర్కిల్, కరీంనగర్ లోని వారి స్వగృహంలో పంపిణీ చేయడం జరిగింది. మిత్రులు గాదె నీలకంఠం, మల్యాల నర్సయ్య, పాలడుగుల శ్రీనివాస్, నీరుమల్ల అనంత రాములు, జిల్లా గౌరయ్య, గుండ శ్రీనివాస్ గారల సహకారంతో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ, కాపర్తి బాపురాజ, గుండ సత్యనారాయణ, ఆదిమూలం భాస్కర్, సాయి స్వరూప్ పాల్గొన్నారు. భోక్తలు నిర్వాహకులు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం కూడా పాటించారు
బ్రహ్మణోత్తములకు నిత్యావసరాల పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి