తేదీ 5.5.2020 సాయంత్రం ఐదు గంటలకు మిర్యాలగూడ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు మిర్యాలగూడ మునిసిపాలిటీ ఆవరణలో ఉన్న నూతన భవనం ముందు అధ్యక్షులు ఏచూరి మురహరి గారి అధ్యక్షతన మునిసిపాలిటీ చైర్ పర్సన్ తిరునగరు భార్గవ్ గారి ఆధ్వర్యంలో కరోనా గురించి కార్యక్రమమును ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఐదు వందల ఇరవై మందికి డెటాల్ సబ్బులు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అవోపా అధ్యక్షులు మురహరి గారు మాట్లాడుతూ కరోనా వల్ల తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, ప్రపంచం మొత్తం వణికిపోతోందని, ఆ వ్యాధి నివారణకు సహాయపడే డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసువారికి మా వంతుగా అవోపా తరఫున సబ్బులు, మాస్కులు పంపిణీ చేస్తున్నామని తెలియజేసారు. మునిసిపాలిటీ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు మాట్లాడుతూ మిర్యాలగూడ వారు మునిసిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి డెటాల్ సబ్బులు మరియు మాస్కులు పంపిణీ చేస్తున్నందుకు వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారని వీరు చేస్తున్న పనిని గుర్తించి వారు సబ్బులు మాస్కులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని అదేవిధంగా వీరు వేరు వేరు సేవా కార్యక్రమాలు చేపట్టాలని అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అవోపా సభ్యులు దేవరశెట్టి ఖాదర్ బాబు గారు మాట్లాడుతూ కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నదని, దానిని కట్టడి చేయడానికి ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ, పారిశుద్ధ్య కార్మికులు కృషి చేస్తున్నారని ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల గురించి చెప్పాలంటే మన పనిని మనమే చేసుకోవడానికి సిగ్గు పడతాం అలాంటి పని వారు మేమున్నామంటూ ముందుకు వచ్చి అన్ని ప్రదేశాలను అన్ని ప్రాంతాలను శుభ్రం చేస్తూ మన ప్రాణాలకు రక్షణగా ఉంటున్నారని, పొల్యూషన్ నుండి కాపాడుచున్నారని, కావున వీరికి అవోపా తరపున సెల్యూట్ చేస్తున్నాం అని, చేతులు సబ్బుతో శుభ్రంగా కడగటం మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటిస్తూ కరుణ తరిమికొడదాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమములో ప్రధాన కార్యదర్శి గుంటూరు జనార్ధన్, కక్కిరేణి శ్యామ్ సుందర్ గుప్త, తెడ్ల రఘు, లక్ష్మీకాంతం గుప్తా, అశోక్, శ్రీనివాస్ గార్లు పాల్గొన్నారు, ఆరోగ్యశాఖ వైట్ సోల్జర్స్ అని, పోలీస్ శాఖ కాఖీ సైన్యం అని, పారిశుద్ధ కార్మికులు అలుపెరుగని వారని, వీరే మనకు అమ్మలా కాపాడు వారని, వీరే మనకు అండగా ఉంటారని, వీరికి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా మన వెంటే ఉంటున్నారు, అందుకే వీరు చేస్తున్న త్యాగానికి సేవకు సెల్యూట్ చేస్తున్నామని అందరూ ముక్త కంఠంతో శ్లాఘించారు.
తేదీ 13.5.2020 రోజున ఉదయం 11 గంటలకు అవోపా మిర్యాలగూడ వారు మిర్యాలగూడ డి.ఎస్.పి కార్యాలయం నందు అవోపా అధ్యక్షుడు ఏచూరి మురహరి గారి అధ్యక్షతన డి.ఎస్.పి వెంకటేశ్వర రావు గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ రక్షణ శాఖకు సంబంధించిన 200 మందికి పైగా సిబ్బందికి సబ్బలు మరియు మాస్కులు అవోపా మిర్యాలగూడ వారు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యమములో అధ్యక్షులు మురహరిగారు మాట్లాడుతూ క రోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుందని, దాని నుండి సమాజాన్ని రక్షించడానికి రక్షణ శాఖ (కాఖీ సైన్యం) చేయుచున్న కృషిని దృష్టియందుంచుకుని వారికి డెట్టాల్ సబ్బులు మరియు మాస్కులు ఇవ్వడం జరిగింది అని చెపారు. దీనికి సహకరించిన DSP గారికి ధన్యవాదాలు తెలియజేసారు. DSP వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అవోపా మిర్యాలగూడ వారు మా ఆధీనంలో నున్న వారందరికి సుబ్బలు మాస్కులు ఇవ్వటం మంచి కార్యక్రమమనియు ప్రస్తుతము క రోనా మహమ్మవారి నుండి బయట పడాలంటే అవోపా వారు పంపిణి చేసినవి చాలా ముఖ్యమని ప్రజలందరు కూడా మాస్కులు ధరించాలని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమములో జనరల్ సెక్రెటరీ గుంటూరు జనార్ధన్, లక్ష్మీ కాంతం గుప్త, ప్రసాద్, శ్యామ్ సుందర్ గుప్త గారలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి