అవోపా కోదాడ వారిచే ఆహార పంపిణీ


 అవోపా కోదాడ వారు ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ శ్రీ పాటి శ్రీను గారి సహకారంతో 65 మంది హైవే పై నడుచుకుంటూ గుంటూరు నుండి బలార్ష వెళ్లే వలస కార్మికులకు, చెన్నై నుండి పూణె వెళ్లే కూలీలకు, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే కుటుంబాలకు మరియు పాదచారులకు ఆహారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఇరుకుళ్ళ చెన్నకేశవరావు అవోపా అధ్యక్షులు, వంగవీటి లోకేశ్, వెంపటి రంగారావు, చల్లా అనిల్ కుమార్, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ వీరిని అభినందిస్తున్నవి.


కామెంట్‌లు