అవోపా మంచిర్యాల వారిచే స్నాక్స్ పంపిణీ

ఆర్యవైశ్య అఫీషియల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోప) మంచిర్యాల టౌన్ ఆధ్వర్యంలో కోవిడ్-19  కారణంగా గత 50 రోజులనుండి అనేక సేవా కార్యక్రమలు చేపట్టిన అవోప, ఈరోజు ఉదయం అల్పాహారంగా సుమారు 200 మంది పేద వారికి, రోజువారీ కూలీలకు బిస్కెట్ ప్యాకేట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యఅతిథిగా గౌరవ శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు పాల్గొని అవోప సేవలను కొనియాడారు. గౌరవ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముకేశ్ గౌడ్ గారు మాట్లాడుతూ పేదప్రజలకు  కష్ట కాలంలో ప్రతి రోజూ కడుపునింపిన అవోపాను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్, రాష్ట్ర అవోప కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యన్నారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్, బల్లు శంకర్ లింగం ,పల్లెర్ల శ్రీహరి, సీనియర్ సభ్యులు వొజ్జల నిరంజన్ గారు తదితరులు పాల్గొన్నారు. భోక్తలు వీరిని ఆశీర్వదించారు. కామెంట్‌లు