అవోపా కోదాడ వారి ఆహార పంపిణీ


ఈరోజు  తేదీ 17-5-2020 న హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 16రోజులుగా AVOPA:KODADA వారు ఆహార పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు ఆవోప కోదాడ జీవిత సభ్యులు, కమిటీ మెంబర్ శ్రీ వెంపటి రంగారావు- మాధవి గారల సహకారంతో చెన్నై నుండి UP సైకిళ్ళపై, మరియు హైదరాబాద్ నుండి కోల్కత్తా బసులల్లో వెళ్లే వలస కూలీలకు, ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు.  కొంత మందికి చిమిర్యాల వాస్తవ్యులు హనుమత్ జయంతి సందర్భంగా X రోడ్డులో పులిహోరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, దాత వెంపటి రంగారావు, పైడిమర్రి అభిరామ్, భగత్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు