తేదీ 08-05-2020 శుక్రవారం రోజున అవోపా అధ్యక్షులు వంగవేటి హనుమంతరావు ఆధ్వర్యంలో హుజూర్ నగర్ వారు ఒక రోజు నిరుపేదలకు బోజనాలను పంపిణీ చేశారు. ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తున్న కారోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ చేయగా అన్నార్తులకు ఆహారం పంపిణీ చేయు ఉద్దేశ్యంతో సుర్యాపేట జిల్లా హుజూర్ నగర్ శ్రీ షిరిడీ సాయి బాబా కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన అవోపా హుజుర్ నగర్ వారు 75 కేజీల బియ్యంతో కిచిడి తయారు చేపించి మానవ సేవయే మాధవ సేవ అంటూ 650 ఆహార పొట్లాలను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. అన్నార్తులు అన్న దాత సుఖిభవ అంటూ వారిని దివించారు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వీరి సేవలను కొనియాడుచున్నవి.
అవోపా హుజుర్ నగర్ వారిచే ఆహార పొట్లాల పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి