తేదీ 5.5.2020 రోజున డిప్యుటీ డి.హెచ్.ఎం.ఓ కార్యాలయంలో డి.డి.హెచ్.ఎం.ఓ శ్రీ. కె.రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో అవోపా మిర్యాలగూడ అధ్యక్షుడు ఏచూరి మురహరి అధ్యక్షత వహించి ప్రసంగించారు. అధ్యక్షోపన్యాసంలో మురహరి గారు మాట్లాడుచూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోన మహమ్మారిన ప్రజలు పడకుండా, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహోరాత్రులు సేవ చేయుచున్న డాక్టర్లను, వైద్య సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను గౌరవించాలని, వారికి కృతజ్ఞతలు తెలుపు కోవాలని, వారికి చిరు కానుక ఇవ్వాలని భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి సుమారు160 మంది ఆరోగ్య కార్యకర్తలకు సుమారు రూ.20,000 ల విలువైన డెట్టాల్ సబ్బులు, మాస్కులు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా మిర్యాలగూడ అధ్యక్షులు ఏచూరి మురహరి, జనార్దన్, డాక్టర్ రవి, లెడ్ల జవహర్ బాబు, ఖాదర్ బాబు, లక్ష్మీకాంతం, తెడ్ల రఘు, శంసిందర్ గుప్త, పురుషోత్తం గారలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనకు సహకరించిన తన మిత్రులు, కార్యదర్శులకు, సభ్యులకు అధ్యక్షులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పారిశుధ్య కార్మికులను, వైద్య సిబ్బందిని, పోలీసు వారిని సన్మానించిన అవోపా మిర్యాలగూడ వారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి