అవోపా కోదాడ వారి ఆహార పంపిణీ


అవోపా కోదాడ వారు గత వారం రోజు లుగా కోదాడ హై వే పై నడుచుకుంటూ వెలుతున్న వలస కూలీలకు చేస్తున్న సహకారం చూసిన గన్నారపు రాజశేఖర్- శారద గారు కంచి పరమాచార్యుల స్వామి వారి జయంతి  సందర్భంగా వారి సహకారంతో 65 మంది హైవే పై నడుచుకుంటూ విజయవాడ, గుడివాడ, నెల్లూరు, ఒంగోలు, చెన్నయ్ నుండి మధ్యప్రదేశ్, అహ్మదాబాద్, ఘోరక్పూర్, జైపూర్  వెళుతున్న వారికి ఆహారం పంపిణీ చేసారు. ఖమ్మం వైపు వెళ్లాల్సి పొరపాటున హైదరాబాద్ వెళ్తున్నవారికి దారిని తెలియచేసినారు. కోదాడ  అవోపా ఉపాధ్యక్షులు కంది బండ వేంకటేశ్వర రావు, వంగవీటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్, కొండ్లే రవిచంద్ర,చల్లా వెంకటేశ్, రంగారావు మరియు కోదాడ మునిసిపల్ ఛైర్పర్సన్ శిరీష లక్ష్మీ నారాయణ గారు పాల్గొన్నారు.


కామెంట్‌లు