అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి ఆహార పొట్లాల పంపిణీ


తేదీ 6.4.2020 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ.పి.వి.రమణయ్య హైదరాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ భీంరెడ్డి గారికి పోలీస్ శాఖ వారికి మరియు బీద అన్నార్తులకు వరుసగా 9 రోజులు పంపిణీ చేయుటకు నిర్ణయించుకుని ఈ రోజటికి ఆహార పొట్లాలు అందించారు.  ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ సి.ఈ.ఓ టి.నాగేశ్వరరావు, విశ్రాంత కోటాక్ బ్యాంక్ ఆఫీసర్ పి.ధనంజయరావు, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ టి.ముకుందరావు మరియు V3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన మరియు సహకరిస్తున్న సంస్థ సభ్యులకు, శ్రేయోభిలాషులకు అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య గారు ధన్యవాదములు తెలియ బర్చారు.


కామెంట్‌లు