తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, శ్రీ కాచం సత్యనారాయణ వారి V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజక వర్గ పరిధిలోని వందమంది పేద వైశ్య ఆటో డ్రైవర్లకు చైతన్యపురిలోని V3 కార్యాలయం వద్ద మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా v3 న్యూస్, వైశ్య వికాస వేదికల చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ మానవాళి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితులలో రోజువారి వేతనాలపై ఆధారపడి జీవనం కొనసాగించే వారికి రెండు ముద్దలు దొరకడం కూడా కష్టతరమైనది అన్నారు. అలాంటివారికి ఆపన్న హస్తం అందించేందుకు వైశ్య వికాస వేదిక సిద్ధంగా ఉందన్నారు. వి త్రి న్యూస్ వైశ్య వికాస వేదికల ద్వారా పేద వైశ్యులకే కాకుండా కరోనా కట్టడి కోసం పోరాడుతున్న వైద్య , మున్సిపల్ సిబ్బందికి, పోలీసులకు, వలస కూలీలకు ప్రతినిత్యం 1500 బిర్యానీ బాక్సులను పంపిణీ చేస్తున్నామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని వైశ్య ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ సమాజంలో ఎన్నో వైశ్య సంఘాలు ఉన్నా తమ అవసరాలను గుర్తించ లేదన్నారు. వైశ్య వికాస వేదిక సకాలంలో స్పందించి తమ ఆకలి బాధలను అర్థం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక ఫౌండర్ ట్రస్టీ లు నంగునూరు రమేష్, మనసాని సుధీర్ కుమార్, చీదర నాగేందర్, ఖండే రామ్ నరేష్, కొత్త రవి, తెలంగాణ ఉద్యమ సహచర మిత్రులు ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా, ఆవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ అధ్యక్షులు పి.వి. రమణయ్య, V3 న్యూస్ సిబ్బంది బాదం రవి కుమార్ , ఉప్పల శివరాం గుప్తా, అభిషేక్ , కార్తీక్ , మేరెడ్డి భూపేష్ , కోడి గంటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
కాచం ఫౌండేషన్ ద్వారా ఆటో డ్రైవర్స్ కు నిత్యావసరాల పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి