అవోపా జనగామ వారిచే అన్నదాన వితరణ


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న"కరోనా మహమ్మారి" నుండి రక్షణ పొందుటకు గాను కేంద్ర ప్రభుత్వం తేదీ 07.05.2020 వరకు లాక్ డౌన్ చెయ్యడం జరిగినది. దీనిని దృష్టిలో వుంచుకొని ఈ రోజు అనగా 28.04.2020, రోజున స్థానిక పాత ఆంధ్ర బ్యాంకు వద్ద 60 మంది పారిశుద్ధ్య కార్మికులకు అవోప జనగాం జిల్లా ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జనగామ మున్సిపల్ చైర్మెన్ పోకల జమున గారు హాజరైనారు. దాత మరియు అవోప జనగామ జిల్లా అద్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఈ సమయములో బీద వారిని ఆదుకోవడము వారికీ ఒక పూట బోజనము పెట్టడము లాంటి సేవా కార్యక్రమాలు అందరు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమములో కౌన్సిలర్లు వంగాల కళ్యాణి మల్లరెడ్డి , పజ్జురి గోపయ్య , కృష్ణ జీవన్ బజాజ్, తమిశెట్టి మల్లికార్జున, దారం నర్సయ్య, ముక్క ప్రకాష్, దారం సందీప్ , కసం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు